13-07-2025 01:25:45 AM
ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల కోసం అంబేద్కర్ తాపత్రయపడ్డారు
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): 75 సంవత్సరాలుగా భారత దేశ ఐక్యతను కాపాడుకోవడానికి రాజ్యాంగం అందించిన సేవలు అమూల్యమైనవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కొనియాడారు. స్వాతంత్య్ర అనంతరం మనకు అనేక బాహ్య దురాక్రమణలు, అంతర్గత అవాంతరాలు ఎదురైనప్పటికీ భారత్ ఎల్లప్పు డూ బలంగా, ఐక్యంగా నిలబడటానికి రాజ్యాంగం గొప్ప సహకారం అందించిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కు ల కోసం అంబేద్కర్ ఎంతో తాపత్రయపడ్డారని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. సమానత్వ సాధనే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ లక్ష్యమని, భవిష్యత్తు అవసరాల రిత్యా రాజ్యాంగ సవరణలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనుమతించారని, ఆ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని అభి ప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో రూపొందించారని, తద్వారానే ప్రతి సామాన్యుడు తన హక్కులను పొందగల్గుతున్నాడని కొనియాడారు.
‘భారత రాజ్యాం గ రూపకల్పనలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాత్ర’ అనే అంశంపై శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా సరళిని లోతుగా జస్టిస్ బీఆర్ గవాయ్ విశ్లేషించారు. అతి సమైఖ్య, అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేద్కర్ వ్యతిరేకించిన విషయాన్ని జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు.
రాజ్యాంగ ఆత్మలా, రక్షణ కవచంలా ఆర్టికల్ 32 పౌరహక్కులకు భంగం కలగకుండా కాపాడుతోందన్నారు. పరిష్కార మార్గాలు లేని హక్కులున్నా ఉపయోగం లేదన్న అంబేద్కర్ ఆలోచనలను ఆవిష్కరించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించిందని వివరించారు. అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉన్నప్పటికీ..ఏ రాష్ట్రానికి ఆ రాష్ర్టంతో పాటు సమాఖ్య పౌరసత్వం ఉంద ని అన్నారు.
అందుకు భిన్నంగా రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా బలమైన ప్ర జాస్వామ్య దేశంగా పటిష్టపరిచే ఒకే దేశం ఒకే రాజ్యాంగాన్ని అంబేద్కర్ అమల్లోకి తీ సుకురావటం గర్వించాల్సిన విషయమని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి న ఇన్ని ఏళ్ల కాలంలో అంతర్గతంగా, బహిర్గతంగా ఎన్నో సమస్యలు వచ్చినా ఒకే రా జ్యాంగం కారణంగానే వాటన్నింటిని తట్టుకొని శక్తివంతంగా నిలబడిందని తెలిపారు.
త్వరలోనే మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తానని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశికసూత్రాలు రెండూ ఎంతో ప్రధానమైనవ న్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం సాధించినప్పుడే సార్థకత లభిస్తుందన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం నరసింహా మాట్లాడుతూ.. ఉస్మాని యా విశ్వవిద్యాలయానికి భారత ప్రధాన న్యాయమూర్తితో హాజరుకావటం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబే ద్కర్‌కు హైదరాబాద్‌కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. నాటి నిజాం..హైదరాబాద్ స్టేట్ చీఫ్ జస్టిస్ పదవి చేపట్టా ల్సిందిగా అంబేద్కర్‌ను ఆహ్వానించారని..
అందుకు అంబేద్కర్ సున్నితంగా తిరస్కరించారన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సామా జిక ఉద్యమాలకు అంబేద్కర్ మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ తన ఆటో బయోగ్రఫీలో హైదరాబాద్ ఉద్యమాలు, సామాజిక న్యాయం సహా అనే క విషయాలను వెల్లడించారని వివరించారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ మాట్లాడు తూ...భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్రపై భారత ప్రధాన న్యాయమూర్తితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ చొరవను ప్ర శంసించారు. ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ..108 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యా లయ ప్రగతిని నివేదించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ప్రసంగం కోసం తమ విద్యార్థులు ఎంతో ఆసక్తిని ప్రదర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయా కళాశాలల ప్రగతి, భవిష్యత్తు కార్యచరణను ఈ సందర్భంగా వెల్లడించారు. మరిన్ని కార్యక్రమాలు, విద్యా, పరిశో ధనల ద్వారా ఓయూ ఔన్నత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వీసీ హామీ ఇచ్చారు. కార్యక్రమానంతరం వచ్చిన ము ఖ్యఅతిథులను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేందర్‌కుమార్‌నాయక్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యా యవాదులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యా ర్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.