6 April, 2026 | 3:55 AM

ఆమనగల్లులో చలివేంద్రం ప్రారంభం

06-04-2026 02:18 AM

32 ఏళ్లుగా కొనసాగుతున్న సేవా యజ్ఞం

ఆమనగల్లు, ఏప్రిల్ 5 (విజయక్రాంతి):  వేసవి కాలం దృష్ట్యా ప్రయాణికుల, ప్రజల దాహార్తిని తీర్చడానికి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎస్.హెచ్.ఓ వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభించారు. ఆమనగల్లు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గత 32 ఏళ్ళు గా ఈ చలివేంద్రాన్ని నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి బాబా బోధనలను అనుసరిస్తూ, సామాజిక బాధ్యతగా గత మూడు దశాబ్దాలుగా ఈ సేవను అందించడం అభినందనీయమని కొనియాడారు.

పరిశుభ్రమైన వాతావరణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందుతున్న సాయి భక్తులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.సమితి కన్వీనర్ దొంతు శ్రీను మాట్లాడుతూ  గత 32 ఏళ్లుగా ప్రతి ఏటా వేసవిలో బస్టాండ్ వద్ద ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతిరోజూ కుండలను శుభ్రపరిచి, కేవలం మినరల్ వాటర్ మాత్రమే నింపుతున్నామని చెప్పారు.

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులకు, స్థానికులకు చల్లని తాగునీరు అందించి వారి దాహార్తిని తీర్చడమే మా ప్రధాన ఉద్దేశం వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దొంతు పుల్లయ్య, ఉప్పు శ్రీశైలం, ఆలేటి నారాయణ సాగర్, కృష్ణారెడ్డి, గోల్ రాము, ఎన్.ఆర్. ప్రభాకర్, పోలిశెట్టి శ్రీనివాస్, ఆమనగంటి సంజీవ్ కుమార్, అప్పం తిరుపతయ్య, దాస శ్రీనివాసులు, విజయ్ కుమార్, ఆమనగంటి నాగభూషణం అయ్యగారు, మొహమ్మద్ సమీహుద్దీన్, శంకర్, అల్లాజి, ఎన్. శ్రీధర్, గోల్ బ్రహ్మం, నాగిళ్ల లింగం తదితరులు పాల్గొన్నారు.