జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్‌ల హ్యాట్రిక్ విజయం
స్వర్ణ పథకం సాధించిన ముక్కెర దేవేందర్ ప్రసాద్
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 5(విజయక్రాంతి): శాస్త్రీయ నేర పరిశోధనలో తెలంగాణ పోలీసులు మరోసారి దేశానికి మార్గదర్శకులుగా నిలిచారు. మహారాష్ట్ర నాగపూర్ లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్ విధి సమ్మేళనం (AIPDM) 2025 26 లో తెలంగాణ పోలీస్ జట్టు ఛాంపియన్ షిప్ సాధించి వరుసగా మూడవసారి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఛాంపియన్ షిప్ పోటీలలో తెలంగాణ పోలీస్ అధికారులు వివిధ విభాగాలలో పథకాలు సాధించారు.
ఈ నేపథ్యంలో యాంటీ సపోటాజ్ తనిఖీ, పోలీస్ వీడియో చిత్రీకరణ, కంప్యూటర్ పై అవగాహన, శాస్త్రీయ సహాయంతో దర్యాప్తు విభాగాలలో బంగారు పతకాలు సాధించగా ఇలాంటి సబోటాజ్ తనిఖీ,శాస్త్రీయ సహాయంతో దర్యాప్తు,పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాలలో వెండి పతకాలు సాధించారు. ఛాంపియన్షిప్ పోటీలలో స్వర్ణ పథకాలు సాధించిన విజేతలు 6 మందిలో జి గణేష్. ఇన్స్పెక్టర్ ఎంవిఎస్‌ఎన్ రెడ్డి.ఏఆర్ ఎస్‌ఐ (కంప్యూటర్) లు జే నవీన్. ఎస్త్స్ర (శాస్త్రీయ సహాయంతో దర్యాప్తు). హెడ్ కానిస్టేబుల్ ముఖ్య దేవేందర్ ప్రసాద్ (పోలీస్ వీడియో చిత్రీకరణ).
పోలీస్ కానిస్టేబుల్ బద్రు నాయక్(యాంటీ సబోటాజ్ తనిఖీ). పోలీస్ కానిస్టేబుల్ ఆర్ దివాకర్ రెడ్డి (యాంటీ సబోటాజ్ తనిఖీ). వెండి పథకాలను సాధించిన విజేతలు ఎస్త్స్ర బి జయప్రకాష్ గౌడ్ (శాస్త్రీయ సహాయంతో దర్యాప్తు).హెడ్ కానిస్టేబుల్ ఏ రామకృష్ణ (యాంటి సబోటాజ్ తనిఖీ). పోలీస్ కానిస్టేబుల్ కే రాజశేఖర్(పోలీస్ ఫొటోగ్రఫీ). కాంస్య పథకాలు సాధించిన విజేతలు ఎస్త్స్ర జె నవీన్ (శాస్త్రీయ సహాయంతో దర్యాప్తు).
మహిళా ఎస్త్స్ర రాధిక యాదవ్(శాస్త్రీయ సహాయంతో దర్యాప్తు). పోలీస్ కానిస్టేబుల్ టి సురేష్ (పోలీస్ వీడియో చిత్రీకరణ). వీటితో పాటు 3 విజేత ట్రోఫీలు.. యాంటీ సపోటాస్ తనిఖీ, కంప్యూటర్ లు,పోలీస్ వీడియో చిత్రీకరణ,2 రన్నర్ ట్రోఫీలు.పోలీస్ ఫోటోగ్రఫీ,శాస్త్రీయ సహాయంతో దర్యాప్తు,సాధించి మొత్తం విజేత ట్రోఫీని కైవసం చేసుకున్నారు.




