6 July, 2026 | 2:09 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

మరో ప్రేమకథతో..

14-07-2024 01:25 AM

కథానాయకుడు ధనుష్ ఈ నెల 26న ‘రాయన్’గా థియేటర్లలోకి రానున్నారు. అపర్ణ బాలమురళి, సందీప్ కిషన్ తదితర తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ యాభైవ చిత్రం. కాగా దీనికి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. శేఖర్ కమ్ముల దర్శకుడిగా ‘కుబేర’ సినిమాలోనూ నటిస్తున్న ధనుష్, తర్వాత చిత్రాన్ని హిందీలో చేయనున్నారు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘రాంఝనా’. బాలీవుడ్‌లో ధనుష్‌కి ఇదే తొలి చిత్రం కాగా, అనంతరం వీరిద్దరి కలయికలో ‘అట్రంగీ రే’ చిత్రం తెరకెక్కింది. ఈ రెండూ ప్రేమకథలే కాగా మరో ప్రేమకథతో వీరివురూ ప్రేక్షకుల మెప్పించేందుకు సన్నద్దమవుతున్నారు.

‘తేరే ఇష్క్ మే’ అనే టైటిల్ ఈ సినిమాకి ఖరారు చేసినట్టు సమాచారం. అక్టోబరు నుంచి చిత్రీకరణ ఆరంభం కానున్న ఈ సినిమా వారణాసి, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో జరుగనుంది. ధనుష్ కలయిలో వచ్చిన ఈ రెండు ప్రేమకథలకి మంచి ఆదరణ లభించింది. సంగీతపరంగానూ మెప్పించిన ఈ సినిమాల తర్వాత ఇప్పుడు ముస్తాబవుతున్న ఈ ప్రేమకథ చిత్రంలో నాయికగా త్రిప్తి డిమ్రిని ఎంపిక చేశాయట చిత్ర వర్గాలు. గత రెండు చిత్రాలకి సంగీతం అందించిన ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి స్వరాలందిచనున్నారు. ప్రేమ లోతుల్లోకి తీసుకెళ్ళే ఆనంద్ ఎల్ రాయ్ సినిమా కోసం ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేమికులు.