తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..
19-05-2024 04:32 PM
ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 17 వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ తలపడుతున్న మ్యాచులో పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది . అథర్వ తైడే 27 బంతుల్లో 46 పరుగులు చేసి సన్వీర్ కింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నటరాజన్ వేసిన 10 ఓవర్ లో హైదరాబాద్ కు వికెట్ దక్కింది. ఒక ఓవర్ వేసిన నటరాజన్ వికెట్ తీసి 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుతం పంజాబ్ 12 ఓవర్లకు వికెట్ కోల్పోయి 129 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్ సిమ్రన్ సింగ్(64), రిలీ రోసో(14) పరుగులతో క్రీజులో ఉన్నారు.






