22 April, 2026 | 5:35 PM

నిమ్జ్‌తో జహీరాబాద్ రూపురేఖలే మారుతాయి

27-06-2024 05:06 AM
  • యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి : మంత్రి దామోదర రాజనర్సింహ

జహీరాబాద్/ఝరాసంగం, జూన్ 26: నిమ్జ్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని, ఈ ప్రాజె క్టు పూర్తయితే జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల రూపురేఖలు మారుతాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఝరాసంగంలోని వాసవి కల్యాణ మండపంలో కలెక్టర్ క్రాంతి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణీక్‌రావుతో కలిసి ఎల్గోయి, ముంగి గ్రామాల నిమ్జ్ భూ నిర్వాసితులకు మంత్రి పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2013 చట్ట ప్రకా రం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నిమ్జ్‌లో పెద్ద పరిశ్రమలు ఏర్పాటయితే 3 లక్షల నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కాగా, భూ నిర్వాసితుల్లో మిగిలిన రైతులను కూడా ఆదుకోవాలని ఎమ్మెల్యే మాణీక్‌రావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.