11-12-2025 12:29:31 AM
అందాల పోటీలో టైటిల్ గెలుచుకున్న మరో కొత్తం దం చిత్రపరిశ్రమకు పరిచయమవుతోంది. ఆమే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో కిరీటం దక్కించుకున్న రియా సింఘా. ఈ భామ తెలుగు సినిమాతోనే నట ప్రయాణం ప్రారంభిస్తుండటం విశేషం. కమెడియన్ సత్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జెట్లీ’. దర్శకుడు రితేశ్ రాణా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో రియా సింఘా హీరోయిన్‌గా పరిచయమవుతోంది.
రియా సింఘాకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ మేకర్స్ బుధవారం ఆమె ఫస్ట్‌లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో ఉంది రియా. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్ మెంట్, చిరంజీవి చెర్రీ, హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ; డీవోపీ: సురేశ్ సారంగం; యాక్షన్: వింగ్ చున్ అంజి; ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్.