13-06-2025 12:00:00 AM
టాలీవుడ్ స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. వర్కింగ్ టైటి ‘గోపీచంద్33’గా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ హిస్టారికల్ ఎపిక్ షూటింగ్ తొలి షెడ్యూల్ ఏప్రిల్‌లో పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్‌లో తాజా షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది.
గోపిచంద్ ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విభిన్న పాత్ర లో కనిపించనున్నారు. గురువారం హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు.
ఆయన ఒక యోధుడిగా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘటనను ఆవిష్కరిస్తూ, మరిచిపోయిన అధ్యాయానికి మళ్లీ జీవం పోస్తుందని టీమ్ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరా లను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.