24 August, 2026 | 3:41 AM

వాడిపోతున్న పత్తి పొలాలు

24-08-2026 02:03 AM

మాగనూరు, ఆగస్టు 23: మండలంలో ఎల్ నినో ప్రభావముతో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పిట్ట పంటలు వాడిపోతున్నాయి. నారాయణపేట జిల్లా మాగునూరు మండలంలోని వివిధ గ్రామాల్లో వర్షాలు కురవడం వల్ల వేసిన పత్తి పంట కొంత ఎదిగినప్పటికీ తీరా పూతకాయ దశ వచ్చేసరికి వర్షాలు కురువకపోవడంతో పత్తి పంట వాడిపోతున్నాయి. గత 15 రోజుల నుంచి పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల వేసిన పత్తి పంటలు ఎండు ముఖం పడుతున్నాయి.

పత్తి పంట ఎండు ముఖం పట్టడం వల్ల రైతులు ఆందోళనలు చెందుతున్నారు. పెట్టుబడి కైనా డబ్బులు వస్తాయో లేదో అని రైతులు ఆకాశం వైపు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. నాలుగైదు రోజులు వర్షాలు కురువకపోతే పత్తి పంట పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారుల చే పూర్తిస్థాయిలో పత్తి చేలు నష్టపోయిన వారి గుర్తించి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించాలని మండల రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులను, కోరుతున్నారు.