17 April, 2026 | 9:40 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

పబ్లిక్ రొమాన్స్, బ్లడ్, ఫౌల్ లాంగ్వేజ్ లేకుండా..

01-06-2025 12:00 AM

యంగ్ హీరో నరేశ్ అగస్త్య అప్ కమింగ్ మూవీ ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. విపిన్ దర్శకత్వం వహించిన ఈ కంటెంట్-రిచ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాను సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఉమాదేవి కోట నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో శనివారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో డైరె క్టర్ విపిన్ మాట్లాడుతూ..

“ఇది చాలా క్లీన్ ఎంటర్‌టైనర్. ప్రిన్స్ రామవర్మ పెద్ద సంగీత విద్వాంసులు, ట్రావెల్ కోర్ వారసులు. రాచరికాన్ని త్యాగం చేసి మంగళం పల్లి వారి దగ్గర 18 ఏళ్లు సంగీత సాధన చేసిన అలాంటి ప్రత్యేకత వ్యక్తి మా సినిమాలో పాడారు. నటించారు. ఇందులో ఓ పాటకు వాయిద్య పరికరాలు వినియోగించలేదు. అది అరుదైన పాటగా నిలుస్తుందని భావిస్తున్నా” అన్నారు. నిర్మాత ఉమాదేవి మాట్లా డుతూ..

“చిన్నప్పటి నుంచి నాకు కథలు రాయడం ఇష్టం. నా జీవితంలో కే విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రిని కలవడం ఓ భాగ్యం. మంచి సినిమా తీయాలని ఈ ప్రొడక్షన్ హౌస్ స్థాపించా. ప్రతి సినిమాలో కళను కనెక్ట్ చేయాలనేది నా ఆశ. అందుకే మొదట మ్యూజిక్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఈ సినిమాను సిరివెన్నెలకు అంకితం చేస్తున్నా. ఇందులో నా ఫస్ట్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్.

ఆయన మ్యూజిక్ లేకపోతే ఈ కథ లేదు. సెకండ్ హీరో మోహన్ కృష్ణ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మూడో హీరో నరేశ్ అగస్త్య అద్భుతమైన పెర్ఫార్మర్. రబియా ఖాతూన్ నాలుగో హీరో. అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. పబ్లిక్ రొమాన్స్, బ్లడ్, ఫౌల్ లాంగ్వేజ్..

ఈ మూడు లేకుండా సినిమా తీస్తేనే ఈ అవకాశం ఉంటుందని డైరెక్టర్‌కు చెప్పా. ఆయన అలానే సినిమాను చాలా ఆహ్లాదక రంగా తీశారు’ అన్నారు.  మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్, డీవోపీ మోహన్‌కృష్ణ, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.