15 July, 2026 | 6:48 PM

బలం లేకనే బరితెగిస్తున్నారు

07-06-2024 03:24 AM

మేడిపల్లి, జూన్ 6: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకుల కుట్రలతోనే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరగాల్సిన అవిశ్వాసం ఆగిందని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆరోపించారు. గురువారం పీర్జాదిగూడ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యులకు బలం లేకున్నా బరితెగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకే మేడ్చల్  కలెక్టర్ అవిశ్వాసం ఆపుతూ ఆర్డర్ జారీ చేశారని ఆరోపించారు. తనపై చేసిన తప్పుడు ఫిర్యాదుపై జూన్ 1న కేసు నమోదు చేస్తే, కలెక్టర్ జూన్ 5న ఉదయం 11.50 గంటల వరకు అవిశ్వాసం ఆపాలని ఎందుకు ఆర్డర్ జారీ చేయలేదని ప్రశ్నించారు. అయినా ఆ కేసు కు, పీర్జాదిగూడ అవిశ్వాసానికి సంబంధమే లేదన్నారు.

కాంగ్రెస్ నాయకులకు మెజార్టీ సభ్యుల బలం ఉంటే అవిశ్వాసం ప్రక్రియలో బలం నిరూపించుకోవాలి, కానీ తన హత్య కు, తనతో పాటు తన వర్గం కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు యత్నించడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అన్నా రు. అలాగే అవిశ్వాసం ఆపాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారని, కోర్టు కూడా వాళ్ల పిటిషన్‌ను డిస్పోజ్ చేసిందన్నారు. కలెక్టర్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు తమను భయాందోళనకు గురి చేస్తున్నాడని, ప్రభు త్వం అతని ఆగడాలను కట్టడి చేయాలని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ పీర్జాదిగూడ అధ్యక్షుడు బండారు రవీందర్, ప్రధా న కార్యదర్శి ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, మహి ళా అధ్యక్షురాలు నిర్మల పాల్గొన్నారు.