15 July, 2026 | 6:31 PM

కలలు కనాలా..?

07-06-2024 03:28 AM
  • ముంపు ముప్పునకు మాస్టర్ ప్లాన్

కొద్దిపాటి వర్షానికే నగరం అతలాకుతలం

భయాందోళనలో ముంపు ప్రాంతాలు 

నిధులు వెచ్చించినా ఫలితం శూన్యం 

గ్రేటర్ నాలా వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళికలు

హైదరాబాద్ మహానగరంలో ఏ కాలమైనా కొద్దిపాటి వర్షానికే ముం పు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నా యి. 400 ఏళ్ల క్రితం నిర్మించిన హైదరాబాద్ నగరం విపరీతంగా పెరిగిన జనాభా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తట్టుకోలేకపోతోంది. కొద్దిపాటి వర్షం వచ్చినా నగరం అతలాకుతలం అవుతోంది. వరద ఉధృతి కారణంగా నాలాలు పొంగి నదుల్లా పారుతున్నాయి. ఈ వరదల్లో ప్రజలు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. దీంతో వర్షం అంటేనే నగర ప్రజలు వణికిపోతున్నారు. 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (విజయక్రాంతి):  రోజురోజుకు మరింత ఆక్రమణలకు గురవుతున్న నాలాలు సరిహద్దులు చెరిగిపోయాయి. ఈ పరిస్థితులను అధిగమించేం దుకు శాశ్వత పరిష్కారం లేనందున ప్రతి ఏడాది అవే సమస్యలు పునరావృత్తం అవుతున్నాయి. దీంతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 

కొద్దిపాటి వర్షానికే అతలాకుతలం

గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం స్ట్రాం వాటర్ డ్రెయినర్స్ దాదాపు 1302 కిలోమీటర్ల మేర ఉన్నాయి. వీటిలో 390 మేజర్ నాలాలు, 912 కిలో మీ టర్ల మేర మైనర్ నాలాలున్నాయి. ముఖ్యంగా కూకట్‌పల్లి, బేగంపేట, షేక్‌పేట, ముషీరాబాద్, షేక్‌పేట, ఎల్ బీనగర్ తదితర ప్రాంతాలతో పాటు పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో నాలా పరీవాహక ప్రాంతాలన్నీ నీట మునుగుతు న్నాయి. ఏ చిన్నపాటి వర్షం వచ్చినా నాలా పరీవాహక ప్రాంతాల ప్రజలు ఏమరపాటుగా వ్యవహారించినా.. నాలాల్లో ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి.

ప్రతి ఏడాది ఈ తరహా ఘటనలు జరుగుతున్నా .. జీహెచ్ ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల వైఫల్యం గురించి ప్రతిపక్ష పార్టీలు విమర్శ లు చేస్తున్నాయి. నాలాలు కబ్జాల పాలవ్వడంతో పాటు పాలకులకు ముందు చూపు లేని కారణంగానే నగరానికి వరద ముంపు ప్రమాదం నిత్యం పొంచి ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. నగరానికి పొంచి ఉన్న ముంపు ముప్పుపై శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తుంటాయి. ఇప్పటికీ 1908, ఆ తర్వాత వచ్చిన 2000, 2020 సంవత్సరాలలో వచ్చిన భారీ వర్షాల గురించి చర్చించుకుంటాం. ఈ సమయంలో అనేక మంది నాలాల్లో కొట్టుకు పోయి ప్రాణాలు పోగొ ట్టుకున్నారు. 

నిధులెన్ని వెచ్చించినా ఫలితం శూన్యం

నగరంలో వరద ముంపు నివారణ చర్య లు చేపట్టడం బల్దియాకు పెద్ద సవాల్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా నగరంలో ప్రవహిం చే నాలాలు ఆక్రమణలకు గురికావడం, ఇప్పటికే నిర్మాణాలతో ఉండటం తదితర విషయాలు తెల్సిందే. వాస్తవానికి నగరంలో నాలాలా వెడల్పు ఎంత ఉండాలనే దానిపై కూడా అధికారులకు క్లారిటీ లేదు. ఈ విషయాన్ని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తేల్చాల్సి ఉంది. వీరిచ్చే మార్క్ ఆధారంగానే బల్దియా అధికారులు సంబంధిత చర్యలు చేపట్టనున్నారు.

ఇప్పటికే మూసి సుందరీకరణపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఇదిలా ఉండగా, ప్రతి ఏడాది నాలాల పూడిక తీత కోసం దాదాపు రూ. 50 కోట్లకు పైగానే జీహెచ్‌ఎంసీ ఖర్చు చేస్తుంది. అంతే కాకుం డా, మూడేళ్ల క్రితం నాలాలను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు రూ.945 కోట్ల తో 58 పనులు చేపడుతుంది. ఈ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. మొత్తం 1302 కిలోమీటర్ల మేరకునున్న నాలాలను అభివృద్ది పర్చాలంటే అనేక ఏళ్లు పడుతుం ది. నిధులను కూడా అత్యధికంగా వెచ్చించాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో ఎప్పుడో నిజాం కాలం నాటి నాలాలతో 2024 నాటి నగర అభివృద్దికి అనుగుణంగా నాలాలను అభివృద్ది చేయాలని జీహెచ్‌ఎంసీ, ప్రభు త్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే హెచ్‌ఎండిఏ తరహాలోనే గ్రేటర్‌లోని నాలాల అభివృద్దికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.