15 July, 2026 | 7:10 PM

ఎన్నికల్లో గెలుపోటములు సహజం

07-06-2024 03:22 AM

మాజీ ఎంపీ బీబీ పాటిల్

జహీరాబాద్, జూన్ 6: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని జహీరాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు బీబీ పాటిల్ అన్నారు. గురువారం జహీరాబాద్ పట్టణం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లను సాధించామని తెలిపారు.కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడం సంతోషకరమన్నారు.

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజల సమ స్యలను పరిష్కరించేందుకు శాయాశక్తుల కృషి చేస్తానని తెలిపారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఓటమి పాలైనంత మాత్రాన నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, కష్టసుఖాల్లో పాలుపంచుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని భరో సా ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలియజే శారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదవరి అంజిరెడ్డి, పార్టీ నాయకులు జైపాల్‌రెడ్డి, ఉమాకాంత్ పాటిల్, జగన్, సుధీర్ బండారి, దేశెట్టి పాటిల్ పాల్గొన్నారు.