13-01-2026 08:46:50 PM
కొల్చారం,(విజయక్రాంతి): కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వెనుక భాగంలో, చింతల కిష్టయ్య భూమి పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ కాలువ వద్ద గుర్తు తెలియని ఆడ వ్యక్తి మృతదేహం మంగళవారం గుర్తించినట్లు కొల్చారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ఎముకలు మాత్రమే మిగిలిన స్థితిలో ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం మృతురాలి వయసు సుమారు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, మృతదేహ స్థితిని బట్టి ఆమె సుమారు 15 రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే సంబంధిత అధికారులకు సంప్రదించాల్సిన నంబర్లు కొల్చారం ఎస్‌ఐ సెల్: 87126 57919, సీఐ సెల్: 87126 57916 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.