calender_icon.png 13 January, 2026 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

13-01-2026 08:50:26 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని పల్లిమక్త గ్రామంలో నూతన ట్రాన్స్ఫర్మర్ను సెస్ వైస్ ఛైర్మన్ దేవరకొండ తిరుపతి మంగళవారం ప్రారంభించారు. గ్రామంలో రైతులకు లో ఓల్టేజ్ సమస్య అధికంగా ఉన్నందున నూతన విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జిన్నా అనూష అనీల్, సెస్ ఏఈ దివ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ సభ్యులు,కోనరావుపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయిని ప్రభాకర్రెడ్డి,సెస్ ప్రతినిధి సత్తయ్య,లైన్ ఇన్స్పెక్టర్ వైకుంఠం, లైన్మెన్ శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు.