23 June, 2026 | 5:28 PM

Breaking News

ఖరీఫ్ సాగుకు విత్తన మేళా..   •   గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం   •   ప్రీవెడ్డింగ్ షూట్‌లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపిన యువతి   •   రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •  

ఏడుపాయల చెక్ డ్యాంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

23-06-2026 04:13 PM

పాపన్నపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న చెక్ డ్యామ్ లో మంగళవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. చెక్ డ్యాంలో ఓ మహిళ మృతదేహం గమనించిన స్థానికులు పాపన్నపేట పోలీసులకు సమాచారం అందజేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని వెలికి తీసి మృతురాలి ఆచూకీ కోసం పరిశీలించగా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. మృతురాలి దేహం పై బ్లూ కలర్ నైటీతో పాటు, చెవులకు రేడిమెట్ కమ్మలు, ముక్కు పుడక ఉందని, మృతురాలి ఫోటో ఆధారంగా మృతురాలిని గుర్తించిన వారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఫోన్ నెంబర్ 87126 57920, రూరల్ సీఐ కృష్ణమూర్తి 87126 57883 లకు సంప్రదించాలని ఎస్ఐ కోరారు.