calender_icon.png 8 August, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

08-08-2025 12:32:34 AM

బాన్సువాడ ఆగస్టు 7 ః కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని బొర్లం క్యాంపు లో గల ఆది బసవేశ్వర ఆలయం వద్ద ఉన్న రేకుల షెడ్డులో పటేల్ నిర్మల (37) అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ అశోక్ తెలిపారు.  సీఐ తెలిపిన వివరాల ప్రకా రం  బీర్కూరు మండలం చించోలి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కు 26 సంవత్సరాల క్రితం నిర్మలతో పెళ్లి జరిగింది ఇద్దరు కూతుళ్లు సంతానం కలదు.

గత 15 సంవత్సరాల నుండి మనస్పర్ధలు కారణంగా భర్త శ్రీనివాస్ తో నిర్మల దూరంగా ఉంటు న్నారూ. మృతురాలు తన పెద్ద కూతురు పెళ్లి జరిపించింది రెండవ కూతురు పెళ్లి ఎలా చేయాలి అని తరచుగా బాధపడుతూ, మనస్తాపంతో జీవితం మీద విరక్తి చెంది తనకు తానుగా బాన్సువాడ మండలంలోని బోర్లాం క్యాంపులోని ఆది బసవేశ్వర దేవాలయానికి చెందిన రేకుల షెడ్డు కు గల ఇనుప రాడుకు చీర కొంగుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపా రు. మృతురాలి పెద్ద కూతురు మార్చబోయిన సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు.