30-07-2025 07:03:09 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) నెన్నెల మండలంలో ఇసుక ట్రాక్టర్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. నెన్నెల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద లంబాడితండ, మన్నెగూడెం గ్రామానికి చెందిన ధారావత్ తులసి(32) నెన్నెల బ్యాంక్ కు వెళ్ళడం కోసం ఖర్జీ నుంచి బెల్లంపల్లి వైపు ఇసుక ట్రాక్టర్ B.No TS 20 T 6029 ట్రాలీ నెంబర్ TG 19 T 1798 ఐచర్ ట్రాక్టర్ ఇంజన్ ట్రాలీ మధ్యలో ఉన్న రాడ్ మీద నిలబడింది. నెన్నెల్ గ్రామ శివారు మలుపు వద్ద ట్రాక్టర్ వేగంగా వెళుతూ అదుపు తప్పి ఆమె కిందపడగా ట్రాక్టర్ ట్రాలీ ఎడమ పక్కన ఉన్న టైర్ తలమీద నుంచి వెళ్లడంతో అక్కడే మరణించింది. ఆమె బంధువులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.