18 July, 2026 | 3:02 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •   పాఠశాల విద్యార్థినిలపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు   •   ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల్లో జాప్యం.. రైతుల ఆవేదన   •  

మహిళ అదృశ్యం

16-05-2026 08:31 PM

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కుమారుడు

నవాబ్‌పేట:  మండల పరిధిలోని నాగసముద్రం గడ్డ తండా (రాంసింగ్ తండా) కు చెందిన మూడావత్ సీతాబాయి (55) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు మూడావత్ గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాబాయి గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో తరచూ ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లేది. అలా వెళ్లిన ప్రతిసారీ రెండు, మూడు రోజుల్లో తిరిగి ఇంటికి వచ్చేసేది. గత నెల ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళింది.

గతంలో లాగే తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, రోజులు గడుస్తున్నా ఆమె ఇంటికి తిరిగి రాలేదు.ఈ క్రమంలో మరుసటి రోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, మీ అమ్మ మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో కూర్చొని ఉందని సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో చివరకు శనివారం  కుమారుడు గోపాల్ నవాబ్‌పేట పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరకు నవాబ్‌పేట పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.