calender_icon.png 11 September, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధురానగర్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం

05-11-2024 01:19:11 PM

హైదరాబాద్: నగరం నడిబోడ్డున మరో దారుణం చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు యువకులు అత్యాచారం చేశారన్న మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పని ముగించుకుని వస్తుండగా మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు చెప్పింది. తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న మధురానగర్  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బట్టలు ఉతికేపనుందంటూ తీసుకెళ్లి మహిళపై ముగ్గురు యువకుల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గమనించిన నిందితులు ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా ఒకరిని పట్టుకున్నారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.