కారు డిక్కీలో మహిళ మృతదేహం
కేసులో నిందితుడి అరెస్ట్
భీమదేవరపల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కారు డిక్కిలో మహిళ మృతదేహం ఘటనకు పాల్పడ్డ నిందితుడు పాల్పడ్డ ఏడెల్లి వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు హత్యకు గురైన మానస తండ్రి ప్రోత్సాహం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
సమగ్ర విచారణ కోసం కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.ఇటీవల ఎల్కతుర్తి గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్ట్ పక్కన గల్లీలో నిలిపి ఉంచిన కారులో నుంచి దుర్వాసన వస్తుందన్న స్థానికుల సమాచారం పై గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి చూడగా, కారు డిక్కిలో ఒక గుర్తు తెలియని మహిళ మృత దేహం లభించిందన్నారు.
ఆమెను ఎక్కడో చంపి కారులో ఇక్కడికి తీసుక వచ్చి, కారును పార్క్ చేసినారని ఇచ్చిన పిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి, నగర సీపీ ఆదేశాల మేరకు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టామన్నారు.నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ఎల్కతుర్తి సీ ఐ పులి రమేష్, ఎస్‌ఐ నరసింహ రావు, హెడ్ కానిస్టేబుల్ విఠల్ రావును అభినందించారు.






