27-11-2025 12:00:00 AM
కుటుంబ సభ్యులను బరిలో నిలిపేందుకు యత్నాలు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 26, ( విజయక్రాంతి):ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లలో మహిళలకే పెద్ద పీట వేశారు. రాజకీయ పార్టీలు మహిళా అభ్యర్థుల వేటలో తలమునకయ్యారు. కు టుంబ సభ్యులను బరిలో దింపే ప్రయత్నంలో కొందరు రాజకీయ నాయకులు ప్ర యత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మ డి ఖమ్మం జిల్లాలో మొత్తం 1,042 పంచాయతీలున్నాయి.
వాటిలో 490 పంచా యితీలు మహిళా రిజర్వేషన్ కావడంతో రా జకీయ పార్టీలు మహిళా అభ్యర్థుల వేటలో తలమునకయ్యారు. కొంతమంది నాయకు లు తమ కుటుంబ సభ్యులను బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 571 పంచాయతీలకు 260 సర్పం చ్ స్థానాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీలకు గాను 230 సర్పంచి స్థానాలు మహిళలకే రిజర్వ్ అయ్యాయి.
వీటితో పాటు జనరల్ స్థానాల్లో సైతం మ హిళా అభ్యర్థులు పోటీ చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వార్డుల వారీగా ఖమ్మం జిల్లాలో మొత్తం 5,214 వార్డుల్లో సగానికి పైగా 2,252 స్థానాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4,163 వార్డుల్లో 1,885 వార్డులు మహిళలకే రిజర్వ్ అయ్యా యి. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లలో వారికే పెద్ద పీట దక్కింది. దీంతో రాజకీయ పార్టీలు మహిళ అభ్యర్థులపై దృష్టి సారించాయీ.
మహిళా ఓటర్లే అధికం...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహిళా ఓ టర్లు అధికంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం ఓటర్లు 8,02, 691 ఓటర్ల గాను 3, 88,243 మంది పురుషులు, 4,14,425 మందే మహిళా ఓటర్లు. థర్డ్ జెండార్ ఓట ర్లు 22 మంది ఉన్నారు. పురుషుల కంటే 26, 182 మంది మహిళా ఓటర్లే అధికం. భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,69,048 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 3,25 ,045, మహిళా ఓటర్లు 3,43,979 మంది ఉన్నారు.
థర్డ్ జెండర్లు 24మంది. పురుషుల కంటే 18, 934 మంది మహిళా ఓటర్లే అధి కం. రిజర్వేషన్ స్థానాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ మహిళ అభ్యర్థులను బరిలో దింపేందుకు రాజకీయ పార్టీలు పథకాన్ని రూపొందిస్తున్నాయి. రిజర్వేషన్ ఖరారు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు పంచాయితీలపై ఫోకస్ పెట్టాయి. గ్రామస్థాయి నా యకులతో మంతనాలు ప్రారంభించాయి. కొందరు నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలో దింపేందుకు స్థానిక నాయకు లతో మంతనాలు ప్రారంభించారు.
కేటగిరీల వారీగా...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కులాల ప్రాతిపదికన కేటాయించిన కేటగిరీలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో సర్పంచ్ స్థానాల్లో 76 ఎస్టీ (మహిళ), 48 ఎస్సీ( మహిళ), 24 బిసి ( మహిళ), 112 జనరల్ (మహిళ) స్థానాలు కేటాయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీల గానం 226 ఎస్టి (మహిళ), 4 జనరల్ స్థానాలను కేటాయించారు.
వార్డుల వారీగా పరిశీలిస్తే ఖమ్మం జిల్లాలో 515 వార్డులను ఎస్టీ (మహిళ), 376 ఎస్సీ (మహిళ), 253 బీసీ (మహిళ), 1,098 జనరల్ స్థానాలుగా రిజర్వ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,420 ఎస్టీ ( జనరల్), 13 ఎస్సీ (జనరల్), 10 బీసీ ( జనరల్), 840 స్థానాలను అన్ రిజర్వుడు కేటాయించారు. ఇల్లందు మండలంలో 29 పంచాయతీల గాను 15 ఎస్టి మహిళలకు 14 ఎస్టీ జనరల్ గా రిజర్వ్ చేశారు.
నాన్ షెడ్యూల్ పరిధిలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 15 పంచాయతీలు నాన్ షెడ్యూల్ పరిధిలో ఉన్నాయి. వాటిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అశ్వాపురం బూర్గంపాడు మండలాల్లోని పంచాయతీల్లో ఒక్కో స్థానాన్ని జన రల్ గా కేటాయించారు.
అశ్వాపురం, అశ్వరావుపేట బూర్గంపాడు, దమ్మపేట మండలా ల్లో 9 స్థానాలను అండ్ రిజర్వుగా కేటాయించారు. దీంతో బీసీలు సైతం జనరల్ కేటగి రీలో బరిలో దిగే అవకాశం ఉంది. భద్రాచలం మండలం లో ఒకే పంచాయతీ ఉన్న నేపథ్యంలో ఎస్టీ జనరల్ రిజర్వ్ చేశారు. ఎట్టకేలకు పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.