calender_icon.png 28 November, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసిల్లలో మాజీ నక్సలైట్ దారుణ హత్య

28-11-2025 10:42:19 AM

రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ్గళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన బల్లెపు నర్సయ్య అనే మాజీ నక్సలైట్(Former Naxalite) దారుణహత్యకు గురయ్యాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో నర్సయ్య గతంలో తాను ఎందరినో చంపినట్లు పేర్లతో సహా వెల్లడించడంతో ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. నర్సయ్య తన తండ్రిని చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన జగిత్యాలకు చెందిన జక్కుల సంతోష్ పగతో రగిలిపోయాడు. సంతోష్ పథకం ప్రకారం నర్సయ్యను సిరిసిల్ల సమీపంలోని అగ్రహారం గుట్టలకు పిలిపించి హతమార్చాడని విశ్వాసనీయ సమాచారం. హత్య అనంతరం జక్కుల సంతోష్ జగిత్యాల పోలీసులకు లొంగిపోయాడు. పాత కక్షలు, ప్రతీకారం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.