calender_icon.png 28 November, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిత్వా తుఫాన్ ముప్పు

28-11-2025 11:01:54 AM

హైదరాబాద్: ఏపీకి దిత్వా తుఫాన్(Cyclonic Storm Ditwah) ముప్పు ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాన్ గా బలపడింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 30న ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. దిత్వా తుపాన్ నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన్ని ఆనుకుని ఉంది. దిత్వా తుపాన్ ప్రభావంతో శుక్రవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి.

శుక్రవారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ ప్రటించింది. శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం తుపాన్ ట్రింకోమలలీ(శ్రీలంక)కి 80 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. పుదుచ్చేరికి 480, చెన్నైకి 580 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో ఎనిమిది కిలో మీటర్ల వేగంతో తుపాన్ కదులుతోందని అధికారులు పేర్కొన్నారు.