calender_icon.png 28 November, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ

28-11-2025 11:41:34 AM

హైరదాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే(Panchayat elections) విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ దకశలో  స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 46పై అభ్యతరం వ్యక్తం చేస్తూ నిన్న తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) పిటిషన్ దాఖలైంది. జీవో 46ను సవాల్ చేస్తూ అత్యంత వెనుకబడిన కులాల సంఘాలు పిటిషన్ వేశాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. బీసీలకు అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ కేటాయించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

డెడికేటెడ్ కమిషన్ నివేదిక(Dedicated Commission Report) ప్రకారం రిజర్వేషన్లపై జోవీ తీసుకువచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఇప్పటికే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయింది. గురువారం, డిసెంబర్ 11న జరగనున్న మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సంబంధిత రిటర్నింగ్ అధికారులు 31 జిల్లాల్లో జారీ చేశారు. మొదటి దశలో 4,200 సర్పంచ్ పదవులకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబడతాయి.