28-11-2025 10:22:59 AM
హైదరాబాద్: కోకాపేట భూములకు(Kokapet lands) రెండో విడత ఈ-వేలం నిర్వహిస్తున్నారు. ప్లాట్ నంబర్ 15, 16లోని 9 ఎకరాల భూమికి ఆన్ లైన్ లో వేలం వేశారు. హెచ్ఎండీఏ(Hyderabad Metropolitan Development Authority) భూముల ప్రారంభ ధరను రూ.99 కోట్లుగా నిర్ణయించింది. నవంబర్ 25న జరిగిన తొలివిడత వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. కోకాపేట భూములు ఎకరానికి రూ. 137.25 కోట్లు ధర పలికింది. కోకాపేట నియోపోలీస్(Kokapet Neopolis)లో 29 ఎకరాలు, మూసాపేట దగ్గరున్న 16 ఎకరాల భూమిని వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది. డిసెంబర్ 3,5 తేదీల్లో మిగతా ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించనుంది. కోకాపేట నియోపోలీస్ ప్లాట్లకు ఎకరానికి ప్రారంభ ధర రూ. 99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు ప్రారంభ ధర ఎకరానికి రూ. 70 కోట్లు, మూసాపేట ప్లాట్లకు ప్రారంభ ధర ఎకరానికి రూ. 75 కోట్లుగా నిర్ణయించింది. భూముల వేలం ద్వారా ఆదాయం భారీగా వస్తుందని హెచ్ఎండీఏ ఆశిస్తోంది.