మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసిన సీఐ ధనుంజయ్
ఉప్పల్ , జూలై 31 (విజయక్రాంతి): మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని నాచారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ అన్నారు. అమెరికాకు చెందిన హోప్ ఫర్ హ్యూమానిటీ సంస్థ, విజయవాడకు చెందిన అలర్ట్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మల్లాపూర్ సూర్యనగర్ కాలనీలో నిర్వహిస్తున్న పద్మ ఫ్యాషన్ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం 11వ బ్యాచ్ మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు సీఐ ధనుంజయ్, ఎస్‌ఐ మైబె లి, డబ్ల్యూఏఎస్‌ఐ రజిని తమ చేతుల మీ దుగా సర్టిఫికెట్లు అందజేసి అభినందించా రు. ఈ సందర్భంగా మహిళలు ఉపాధి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
సమాజంలో మహిళల సాధికారతకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. హోప్ ఫర్ హ్యూమానిటీ ఫౌండర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 11 బ్యాచ్లలో సుమారు 60 మంది మహిళలు శిక్షణ పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యప్రసాద్, శ్రీకాంత్, కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు. అమెరికాలోని పీటీఏ సభ్యుల విరాళాలతో ఈ బ్యాచ్ శిక్షణ కార్యక్రమానికి సహకారం అందినట్లు నిర్వాహకులు తెలిపారు.






