calender_icon.png 18 July, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి,మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి అర్హులైన వారందరికీ ఇల్లిస్తాం

18-07-2025 12:22:46 AM

 మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి  

 తిమ్మాపూర్, జూలై 17 (విజయక్రాంతి): గ్రా  మీణ ప్రాంతాల అభివృద్ధి, మౌ లిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయ ణ చెప్పారు. గురువారం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మండలానికి రెండు గ్రామ పంచాయతీ భవనాలు, రెండు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.

స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1148 అంగన్వాడీ భవనాలు, 1144 గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. . అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఇంటి జాగా లేని వారి కూడా నివేశన స్థలాలిచ్చి ఇళ్లు మంజూరు చేస్తామని, జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి రాగానే ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, పార్టీ మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంట రాజేందర్ రెడ్డి, మామిడి అనిల్ కుమార్, బుధారపు శ్రీనివాస్, చింతల లక్ష్మారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, మహ్మద్ అబ్దుల్ సమద్, రాచపల్లి సరిత-ప్రసాద్, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, గూడ కమలాకర్, చంద్రమౌళి, అశోక్, గూడ స్వామి, అల్లాడి రఘు, అయితం మహేశ్ తదితరులుపాల్గొన్నారు.