18 July, 2026 | 1:21 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

12-08-2024 01:12 PM

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని నాలుగవ వార్డులో గత కొన్ని రోజులుగా త్రాగునీడు రావడంలేదని సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి ఎమ్మార్వో ఛాంబర్ లో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. త్రాగునీరు పైపులైన్లను మరమ్మత్తులు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసిల్దార్ కాటమయ్యకు సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కోట రామస్వామి, మహిళలు త్రివేణి, నాగమ్మ, సోమలక్ష్మి, నాగమ్మ, వెంకన్న, రామగిరి వెంకన్న, రజిత తదితరులు పాల్గొన్నారు.