calender_icon.png 21 July, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీరలకోసం దుకాణం ముందు మహిళల పడిగాపులు

21-07-2025 01:21:37 AM

  1. రూ.35 లకే చీర అంటూ దుకాణం ప్రకటన        

తక్కువ ధర చీరల కోసం బారులు తీరిన మహిళలు

గద్వాల, జూలై 20 ( విజయక్రాంతి ) : ఆషాడం సెల్ అంటూ కేవలం 35 రూపాయలకే చీర అంటూ ఓ షాపింగ్ మాల్ వారు ప్రకటన చేశారు. దీంతో ఆ సమాచారం అందుకున్న మహిళ లు ఆదివారం షాప్ ఓపెన్ కాక ముందే వందల సంఖ్యలో షాప్ గేట్ ముందు నిల్చున్న సంఘటన గద్వాల జిల్లా కేంద్రం లో చోటు చేసుకుంది. సెలవు రోజు కావడం వల్ల ఉదయం ఇంటి పని, వంట పని మానేసి తక్కువ ధరకు వస్తుందని షాప్ ముందు మహిళలు పడిగాపులు కాశారు చీర అంటే మహిళలకు ఎనలేని మక్కువ. చీరల షాప్ లకు వెళితే గంటల కొద్దీ మహిళలు చీరలను చూస్తారు.

నచ్చిన కలర్, నచ్చిన అంచు అంటూ షాప్ వాలను చాలా ఇబ్బందులకు గురిచేస్తారు. షాప్ యజమానితో చీర ధరను ఎంతసేపైనా పర్వాలేదు అంటూ బేరం ఆడి చివరికి ఆ చీరను సొంతం చేసుకుంటారు. అలాంటిది బేరం ఆడకుండానే సరసమైన, అతి తక్కువ ధరలకే చీరలు ఇస్తామంటే మహిళలు ఎందుకు ఊరుకుంటారు. ఉన్నపలంగా ఆ షాప్ ని వెతుక్కుంటూ మరీ వెళ్లి గంపెడు చీరలు తెచ్చుకునేందుకు షాప్ ముందుబారులుతీశారు.