calender_icon.png 21 July, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాలు.. తెలంగాణ సంస్కృతి

21-07-2025 01:20:35 AM

- గవర్నర్ విష్ణుదేవ్‌వర్మ 

- హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఉత్సవాలు

- హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల 

ముషీరాబాద్, జూలై 20 (విజయక్రాంతి):  బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెపుతాయని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ అన్నారు. ఆదివారం రాంనగర్‌లో హర్యానా మాజీ గవర్నర్ బండా రు దత్తాత్రేయ నివాసంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు గవర్నర్ హాజరయ్యారు.

ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, కృష్ణ యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా బండారు దత్తాత్రేయ కూతురు, బీజేపీ అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌లకు  స్వాగతం పలికి, బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ సందర్భంగా ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ బోనాల పండుగ తెలంగాణ ప్రత్యేక సంస్కృతి, వైవిధ్య భరితమైన జీవనం, ప్రకృతి పర్యావరణ దేవత అయిన ఎల్లమ్మ (మహాంకాళి మాత) దైవిక ఆరాధనకు ప్రతిబింబమని గవర్నర్ పేర్కొన్నారు.

బోనాల పండుగ శుభ సందర్భంగా దేశ, తెలంగాణ ప్రజలందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతి మరియు అభివృద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని గవర్నర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ వ్యక్తిగత కార్యదర్శి కైలాస్ నాగేష్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.