21-07-2025 01:22:13 AM
- భద్రాద్రి జిల్లా గౌరారంలో ఘటన
- భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స
భద్రాచలం, జూలై 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని గౌరారం ఐటీడీఏ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న నవ్యశ్రీ ఆదివారం పాము కాటుకు గురైంది. వెంటనే హాస్టల్ సిబ్బంది దుమ్ముగూడెం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి విద్యార్థినికి చికిత్స అందిస్తున్నారు. నవ్యశ్రీ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.