16 April, 2026 | 9:01 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

26-06-2025 12:00 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం అసిఫాబాద్,జూన్ 25(విజయ క్రాంతి): నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సెర్ప్ ఎ.పి.ఎం.లు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇస్తున్న ఉల్లాస్ కార్యక్ర మంలో భాగంగా ప్రతి మహిళ అక్షరాస్యత కలిగి ఉండాలని, నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని తెలిపారు.

జిల్లాలో 22 వేల 494 మంది అక్షరాస్యత లేని మహిళలను గుర్తించడం జరిగిందని, వీరిని అక్షరాస్యులుగా మార్చడంలో సెర్ప్ ఇబ్బంది, ఆపరేటర్లు ప్రతి ఇం టింటికి వెళ్లి వివరాలు సేకరించాలని తెలిపారు. ఇప్పటివరకు 10 వేల 227 మంది అభ్యాసకులు, 1 వేయి 67 మంది వాలంటీలను ఎంపిక చేయడం జరిగిందని, అక్షర చేత కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ఉల్లాస్ యాప్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. 

అనంతరం నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ - 2025 గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం సెర్ప్ ఎ.పి.ఎం. లతో సమీక్ష సమావేశం నిర్వహించి స్వయం సహాయక సంఘాల వారికి స్త్రీ నిధి రుణాలు, బ్యాంకు లింకేజీల ప్రక్రియ బ్యాంకర్ల సహకారంతో త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించిన విధంగా ప్రధానోపాధ్యాయుల సంతకాలు తీర్చుకోవాలని, మహిళ సంఘా లు ఆర్థిక బలోపేతం కొరకు ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణాలలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని తెలిపా రు. గిరిజన మహిళ సంఘాల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ఉత్పాదకత కొరకు 4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సమన్వయకర్త కట్కం మధుకర్, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి వంగల నాగరాజు, రిసోర్స్ పర్సన్స్  కొప్పల మోహన్, తుకారం తదితరులు పాల్గొన్నారు.