16 April, 2026 | 7:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

విపత్కర సమయంలో అండగా డీడీఆర్‌ఎఫ్

26-06-2025 12:00 AM
  1. అత్యాధునిక పరికరాలు.. 20 మంది పోలీసు సిబ్బందితో జిల్లాలో ఏర్పాటు
  2. సభ్యుల పనితీరును స్వయంగా పరిశీలించిన ఎస్పీ అఖిల్

ఆదిలాబాద్, జూన్ 25 ( విజయ క్రాంతి ) : వర్షాకాలం దృష్ట్యా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే ప్రజలకు అండగా నిలిచేందుకు డిస్టిక్ డిజాస్టర్ రెస్పా న్స్ ఫోర్స్ (డిడిఆర్‌ఎఫ్) బృందం సిద్ధంగా ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగం గా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడడానికి 20 మంది సభ్యులతో జిల్లా విపత్తు నిర్వహణ బృందం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే సాత్నాల ప్రాజెక్టు వద్ద జిల్లా పోలీసు అధికారులు, విపత్తు నిర్వహణ బృందం సభ్యుల పనితీరును ఎస్పీ బుధవారం స్వయంగా పరిశీలిం చారు.

ముందుగా అధునాతన రక్షణ పరికరాలకు పూజలు చేశారు. అనంతరం బోటు లో ఎస్పీ ప్రయాణించి వారి పనితీరును పరిశీలించి, శిక్షణ సిబ్బందికి ప్రత్యేకంగా సూచ నలు చేశారు. అత్యవసర సమయంలో వెం టనే స్పందించేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ విపత్తు నిర్వహణ బృందం జిల్లాలో ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో 20 మంది పోలీసు సిబ్బందితో శిక్షణ పూర్తి చేసుకుని, ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందని తెలిపారు.

ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో వరదలు సంభవించినప్పు డు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, రోడ్లపై చెట్లు విరిగిపడ్డ సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తమదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రజలకు పోలీసులు మీకు ఉన్నాం అంటూ రక్షణ కల్పిస్తామని తెలిపా రు. ఈ డి.డి.ఆర్.ఎఫ్ బృందం వద్ద రెస్క్యూ బోటు, మోటార్ మిషన్, మెడికల్ స్ట్రక్చర్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్స్ మిష న్ లాంటివి అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ప్రజలకు ఆపత్కాల సమయంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా జిల్లా పోలీసుల ద్వారా ప్రత్యేకంగా ఈ బృం దం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ బృందం హైదరాబాద్ లో వారం రోజులు పాటు శిక్షణ తీసుకొని అత్యవసరంగా స్పందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సాయి నాథ్, ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్, డిడిఆర్ ఎఫ్ బృంద సిబ్బంది పాల్గొన్నారు.