17 June, 2026 | 3:58 AM

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

17-06-2026 02:55 AM

అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి

తాడ్వాయి, జూన్ 16 (విజయక్రాంతి): మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యం పెట్టుకుందని జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మంగళవారం భీమేశ్వర మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

మహిళా రైతులు వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వ్యవసాయంతో మరింత అభివృద్ధి చెందాలని ఆమె సూచించారు.భీమేశ్వర మహిళ రైతు కంపెనీతో మార్కెటింగ్ చేయాలని ఆమె కోరారు. భీమేశ్వర రైతు మహిళా కంపెనీకి పశువుల దాణా కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ. 27 లక్షలు నిధులు మంజూరు చేసిందన్నారు. గోదాం నిర్మాణానికి రూ.15 లక్షల రూపాయలు, ఇందులోని 18 పీజీ సంఘాలకు రూ.50 వేల చొప్పున ప్రోత్సాహం అందించిందన్నారు. 

ఇన్చార్జి ఎంపీడీవో సవిత రెడ్డి మాట్లాడుతూ... మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా మార్చడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. డిపిఎం సురేష్ కుమార్ మాట్లాడుతూ... ప్రతి రైతు పంట మార్పిడి చేసుకొని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. కంపెనీకి నూతనంగా చైర్మన్ కో చైర్మన్ లను ఎన్నుకున్నారు. చైర్మన్ గా శైలజ కో చైర్మన్ గా కరుణ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా సునీత,సుజాత, కవిత, మంజుల లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం రాజు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సత్యభాయి, సీసీలు రాజిరెడ్డి, మెహెర్, అంజయ్య,రాజయ్య, శ్రీనివాస్, కృష్ణాంజలి, అకౌంటెంట్ తిరుపతిరెడ్డి, ఆపరేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.