calender_icon.png 18 July, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు పారిశ్రామికంగా ఎదగాలి

18-07-2025 12:25:44 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: జులై 17 (విజయక్రాంతి)మహిళలు పారిశ్రామిక వ్యక్తులుగా ఎదగాలని, మహిళలు ఆర్థిక అభివృద్ధి తోనే దేశ ప్రగతి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడలో డిఆర్డిఏ, సేర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకుఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మహిళలసమైక్య సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజి, ఇటీవల మరణించిన మహిళా సంఘ సభ్యుల ప్రమాద బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారన్నారు..

వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో అయ్యప్ప, ఆదర్శ గ్రామ సంఘాలకు సంబంధించి నాలుగు ఎకరాల భూమిలో నాలుగు కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.రూ 36 లక్షలతో మహిళా సమైక్య సంఘానికి ఆర్టిసి బస్సు కొనుగోలు చేసి అందజేయడం జరిగిందని తెలిపారు.వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికీ ఆశీర్వాదాలు అందజేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ శేషాద్రి, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు,చెలకల తిరుపతి, కచకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, మాజీ కౌన్సిలర్లు,అన్ని మండల ఏపీఎంలు, మహిళా సమైక్య సంఘ.అధ్యక్షురాలు, మహిళా సంఘ సభ్యులుపాల్గొన్నారు.