నాగిరెడ్డిపేట్ మండలం నుంచి మహిళా శక్తి మహాసభకు భారీగా తరలిన మహిళలు
నాగిరెడ్డిపేట్, జూన్ 9 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళాశక్తి మహాసభకు నాగిరెడ్డిపేట్ మండలం నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు ప్రత్యేక వాహనాల్లో సభకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.
మహిళా సంఘాల రుణ పరిమితి పెంపు, వడ్డీలేని రుణాల పంపిణీ,ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు ఆర్థిక సహాయం వంటి నిర్ణయాలు మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, మహిళాశక్తి మహాసభ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్, మండల సమైక్య అధ్యక్షురాలు శాంతమ్మ, సీసీలు రమేష్, అకౌంటెంట్ రాజు పాల్గొన్నారు.






