10 June, 2026 | 2:47 AM

గోల్డ్ లోన్ కోసం వెళ్తే.. గొలుసులో భాగం మాయం..!

10-06-2026 01:28 AM

బచ్చన్నపేట, జూన్ 9 విజయక్రాంతి:  గోల్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లిన ఓ ఖాతాదారుడి బంగారు గొలుసులోని కొంత భా గం మాయమైందన్న ఆరోపణలు బచ్చన్నపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీ ణ బ్యాంకులో కలకలం రేపాయి.  ఘటనపై బాధితుడు బ్యాంకు మేనేజర్కు. ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కట్కూర్ గ్రామానికి చెందిన తమ్మడి శ్రీకాంత్. బాధితుడి కథనం ప్రకా రం, సుమారు 22.2 గ్రాముల బంగారు గొ లుసును గోల్ లోన్ కోసం బ్యాంకులో సమర్పించారు.

గోల్ తనిఖీ ప్రక్రియ అనంతరం గొలుసులోని కొంత భాగం కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం పరిశీలించగా, మాయమైన భాగం గోల్ తనిఖీ నిర్వహిస్తున్న ఉద్యోగి టేబుల్ డ్రా లో కనిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనతో ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గోల్ తనిఖీ నిర్వహించే ప్రాంతంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  విలువైన బంగారం తనిఖీ చేసే చోట సీసీ కెమెరాలు లేకపోవడం వెనుక కారణాలేమిటని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు.

అలాగే, ఈ ఘటన వెలుగులోకి రావడంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు ఉన్నతాధికారులు గత గోల్ లోన్ లావాదేవీలను కూడా సమగ్రంగా పరిశీలించాలని పలువురు ఖాతాదారులు కోరుతున్నారు. ఇక గోల్ తనిఖీ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి రాజస్థాన్కు చెందిన వ్యక్తి కావడంతో, అతని నియామకం, అర్హతలు, ఎంపిక ప్రక్రియపై కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అతడికి ఈ బాధ్యతలు ఎలా అప్పగించారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, వాస్తవాలు వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.  ఆరోపణలపై బ్యాంకు అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.ఈ ఘటన మాత్రం బచ్చన్నపేటలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.