మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించి ఐసీసీ ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ వేదికగా మెగాటోర్నీ జరగనున్నట్లు ఐసీసీ పేర్కొంది. గ్రూప్ భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, క్వాలిఫయర్‌ొో1 ఉండగా.. గ్రూప్ ఆతిథ్య బంగ్లాదేశ్‌తో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, క్వాలిఫయర్ ఉన్నాయి. ఐర్లాండ్, యూఏఈ, శ్రీలంక, స్కాట్లాండ్‌లు క్వాలిఫయింగ్ ఆడనున్నాయి. క్వాలిఫయింగ్‌లో టాప్‌ఊ నిలిచిన జట్లు క్వాలిఫయర్ క్వాలిఫయర్2గా మెయిన్ డ్రాకు అర్హత సాధించనున్నాయి. గ్రూప్ ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో ఆడనుంది.
ఆ తర్వాత అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో, అక్టోబర్ 9న క్వాలిఫయర్‌ొో1తో, అక్టోబర్ 13న ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. రెండు గ్రూపుల్లో నుంచి టాప్ నిలిచిన జట్లు సెమీస్‌కు ప్రవేశిస్తాయి. అక్టోబర్ 17న తొలి సెమీఫైనల్, 18న రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇక అక్టోబర్ 20న ఢాకా వేదికగా ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగియనుంది. టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరగనుండగా.. అన్ని మ్యాచ్‌లు ఢాకా, సిల్హెట్ వేదికగా జరగనున్నాయి. రెండు సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డేను కేటాయించినట్లు ఐసీసీ పేర్కొంది.






