07-08-2024 09:33:11 PM
పెద్దపల్లి: మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరికి బుధవారం మహిళలు దేహశుద్ధి చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో ఓ పోకిరి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పట్టుకొని చెట్టుకు కట్టేసి చెప్పులతో దేహశుద్ధి చేశారు. ఇలాంటి వ్యక్తుల వల్ల రోడ్లపై మహిళలు తిరగలేకపోతున్నారని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే తోలు తీస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోకిరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.