28 July, 2026 | 2:48 AM

డబుల్ బెడ్ రూములు ఎప్పుడు ఇస్తారు

28-07-2026 01:50 AM

మహిళల ఆందోళన 

నిర్మల్ జులై 27 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సిద్దాపూర్ శివారులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక నంబర్లు ఇచ్చిన ఇందాక స్థలాలు ఇవ్వకపోవడంతో బాధిత మహిళలు సోమవారం ఆందోళన నిర్వహించారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. 600 ఇల్లు నిర్మించి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించకపోవడంపై వారు మండిపడ్డారు  సొంత ఇళ్లు లేక అద్దె భవనాల్లో జీవనం సాగిస్తున్నామని తెలిపారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు సర్వే నిర్వహించి టోకెన్లు కూడా అందజేశారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఇళ్ల కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే అర్హుల జాబితాను పరిశీలించి తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.