26 March, 2026 | 2:50 AM

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

26-03-2026 12:00 AM

బెడ్రూమ్‌లో శవాన్ని పాతిపెట్టిన నిందితులు 

ఏడాది తర్వాత వెలుగులోకి.. 

జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో ఘటన

మేడ్చల్, మార్చి 25(విజయక్రాంతి): ప్రేమకు అడ్డు చెబుతుందని కుమార్తె ప్రియుడుతో కలిసి తల్లిని హతమార్చి బెడ్రూమ్‌లో పాతిపెట్టిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. ఈ కేసు వివరాలను మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.కౌకూరు భరత్ నగర్ కు చెందిన డీఆర్ అంజు (40) గతేడాది మే 12న విధులకు వెళ్లి తిరిగి రాలేదు. అక్టోబర్ 25న పెద్ద కుమార్తె రోషిని తల్లి అదృశ్యంపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కాగా అంజు చిన్న కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతూ బీహార్‌కు చెందిన మొంటి కుమార్ సింగ్‌తో ప్రేమలో పడగా తల్లికి తెలవడంతో తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో మొౌంట్ కుమా ర్‌పై రెండుసార్లు పోక్సో కేసులు నమోదు కాగా జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ ఇద్దరిలో మార్పు రాలేదు.

ఎలాగైనా తల్లిని అడ్డు తొలగించుకోవాలని భావించిన కుమార్తె తన ప్రియుడితో కలిసి అంజు హత్యకు పథ కం వేశారు. గత ఏడాది మే 12న విధులు ముగించుకొని అంజు ఇంట్లోకి రాగానే అప్పటికే ఇంట్లో నక్కి ఉన్న మూంటి దాడి చేశాడు. కుమార్తె తల్లిని గట్టిగా పట్టుకోగా కత్తితో ఆమె గుండెలో పొడిచి హత మార్చా డు. అనంతరం మృతదేహాన్ని బెడ్రూమ్‌లోనే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. ఎలుకల వల్ల నేల పాడైందని నమ్మిం చి సిమెంటు వేయించారు. హత్య తర్వాత నిందితులిద్దరూ ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు.వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు.

పెద్ద కూతురు రోషిని ఫిర్యా దు మేరకు అనుమానంతో మోంటి కుమార్‌ను విచారించగా అసలు నిజం బయటప డింది. తహసీల్దార్ సమక్షంలో మృతదే హాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. మోంటి కుమార్‌తో పాటు కుమార్తెను అరె స్టు చేశారు. మొౌంట్ కుమారును రిమాం డ్‌కు తరలించగా ఆమె ను జువైనల్ హోంకు తరలించారు. చాకచక్యంగా కేసును చేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు.

వేరే వారితో వెళ్లిపోయిందని..

తల్లి వేరే వారితో వెళ్లిపోయిందని అక్కను మైనర్ నమ్మించింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తల్లి చిట్టి డబ్బులను అడుగగా సంబంధిత వ్యక్తి ఎఫ్‌ఐఆర్ కావాలని చెప్పాడు.ఆ డబ్బులు తీసుకోవడానికి ఎఫ్‌ఐఆర్ కోసం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో ఈ దారుణం బయటపడింది.