calender_icon.png 17 July, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికంలోపే మహిళల చేతికి పైకం!

17-07-2025 12:57:55 AM

మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ. 2,500 హామీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి) : కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘మహా లక్ష్మి’ పేరిట ఇచ్చిన హామీల మేరకు.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయా ణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అమలుచేస్తున్నది.

వీటికి తోడు ఇందిరా మహిళా శక్తి భవనాలు, మహిళల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో బస్సుల నిర్వహణ వంటి కార్యక్ర మాలు చేపడుతున్నది. ప్రస్తుతం మరో పథకాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధమవుతున్నది. రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు నెలకు 2,500 ఇచ్చే దిశ గా కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. 

తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు సమా వేశాల్లో ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. 

 దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న పథకాలను అమలుచేసే దిశగా అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మహా లక్ష్మి పథకం పేరిట మహిళలకు ఆర్థిక భరోసా కింద ప్రతినెల రూ. 2,500 కూడా సర్పంచ్ ఎన్నికల కంటే ముందే అందించేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లోకి నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం జమ చేసే కీలక పథకాన్ని ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. అయితే మహాలక్ష్మి పథకం అమలుతో రాష్ర్టంలోని లక్షలాది మం ది మహిళలకు లబ్ధి చేకూరడంతోపాటు రాబో యే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇది కలిసి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వివరాల సేకరణ

ప్రభుత్వ హామీల అమలులో పారదర్శకత, సామాజిక న్యాయానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే ఉన్నతాధికారులు సెర్ప్, మెప్మా వంటి సంస్థల నుంచి మహిళల వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఈలోపే మహిళలకు ఆర్థిక భరోసా కింద డబ్బులను జమ చేయడం ద్వారా తమ ఎన్నికల హామీలను నిలబెట్టుకుని, ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తోంది.