17-07-2025 12:58:22 AM
గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు కట్: ఎస్పీ మహాజన్
ఆదిలాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ప్రతి ఒక్క ఆదివాసి అభివృద్ధి చెందాలంటే చదువు చాలా ముఖ్యమని, యువతకు, పిల్లల కు చదువుపై ఉన్న ప్రాముఖ్యతను తెలియజేసి చదువుకునేందుకు ప్రోత్సహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివాసీ సం స్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అం దించాలని సూచించారు. ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామంలో బుధవారం జరిగిన రాయి సెంటర్ సమావేశంలో ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి జిల్లా ఎస్పీ పాల్గొని ఆదివాసీ లను ఉద్దేశించి పలు సూచనలు చేశారు.
గ్రామానికి వచ్చిన ఎస్పీ, ఏఎస్పీ లకు ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాల నడుమ డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాయి సెంటర్ అధికారులు, రాయి సెంటర్ సభ్యులతో కలిసి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వేలిముద్రలను ఉపయోగించి ఏటీఎం ల ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి జిల్లాలో పండించకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గంజా యి జీవితాలను నాశనం చేస్తుందని గంజాయి సాగు, అమ్మకాలతో ప్రభుత్వ పథకాలు లభించవని తెలిపారు.
ప్రమాదాల నివారణకు మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా మూఢనమ్మకాలు నమ్మకుండా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఎలాంటి బాబాలను తాయత్తులను మంత్రగాలను నమ్మవద్దన్నారు. అదేవిధంగా మైనర్ ల వివాహాల పట్ల శ్రద్ధ వహించాలని మైనర్లకు వివాహ సంబంధాలు వచ్చిన మధ్యవర్తులు వివాహం చేయాలని చూసిన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రభాకర్, ఇంద్రవెల్లి ఎస్‌ఐ సాయన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.