20-01-2026 12:25:49 AM
మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి, జనవరి 19 ( విజయక్రాంతి ) : మహిళా సంక్షేమంతో పాటు, రాష్ట్రవ్యాప్తం గా మహిళలని ఆర్థికంగా బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప శుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలోని స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు, ఇం దిరమ్మ చీరల పంపిణీ చేసేందుకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అధ్యక్షతన ఇందిర మహిళా శక్తి సంబరాల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిలె ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, రా ష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి లో భాగంగా ఇందిరమ్మ చీరలను పంపి ణీ చేశారు.
అదేవిధంగా 2023-24, 2024-25 కి సంబంధించి 529 సంఘాలకు గానూ రూ. 1.60 కోట్ల వడ్డీ లేని రుణాలను మం జూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్ల కిందట కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ 9న మొదటి సంతకం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయా ణం ఫైల్ మీద చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు సారె పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా .. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్ర ప్రభు త్వం పంపిణీ చేస్తున్న చీరలు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పారు. మహిళా సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి ఈ చీరలు చేరుతాయని తెలిపారు.
మహిళలకు పావలా వడ్డీ రుణాన్ని తీసుకువచ్చారు: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలకు పావలా వడ్డీ రుణాన్ని తీసుకువచ్చారని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తెలిపారు.
మహిళల కోసం పలు కార్యక్రమాలు: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
రాష్ట్రంలో కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యే యమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పా రు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు.
మహిళలకు బ్యాంకుల్లో పిలిచి మరి రుణాలు ఇస్తున్నాం: రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు బ్యాంకుల్లో పిలిచి మరి రుణా లు ఇస్తున్నారని రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. మహిళల కో సం అత్యధిక సంక్షేమ పథకాలను కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రజా ప్ర భుత్వం అని కొనియాడారు. ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేద మహిళ పేరుమీద ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘా ల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.