calender_icon.png 5 December, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాటలు కోటలు దాటుతున్నయ్

05-12-2025 12:00:00 AM

  1. కాళ్లు గడప దాటుతలేవు

పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్ డ్రాపుడ్ ఎమ్మెల్యే

ఏ పని చేసినా లాభాపేక్షతోనే

ప్రజాపాలన అంటూనే అరాచకపాలన

గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తి చేసినం

ఆరునెలల్లో ప్రాజెక్టు కంప్లీట్ చేస్తమన్నరు

బీఆర్‌ఎస్‌కు భయపడే హుస్నాబాద్‌లో సభ పెట్టిండ్రు

ఎలక్షన్ కమిషన్ మౌనం ఎందుకు

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్

హుస్నాబాద్, డిసెంబర్ 4 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత వొడితల సతీశ్ కుమార్ గురువా రం మీడియా సమావేశం నిర్వహించి, రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర భాక్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, పనులు జరగడం లేదని ఎద్దేవా చేశారు.

 తట్టెడు మట్టి ఎత్తలేదు

గౌరవెల్లి ప్రాజెక్టు పనుల ఆలస్యంపై మం త్రిని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే 6 నెలల్లో గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. రెండేండ్లయినా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. వైఎస్సార్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన చిన్న ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు 96 శాతం పనులు పూర్తి చేశామన్నారు.

పరిహారంలో మంత్రి నిర్వాసితులను రెచ్చగొట్టి మాట తప్పారని, అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.30 లక్షల ఇప్పిస్తానని చెప్పి, ఇప్పుడు రూ.15 లక్షలు కూడా ఇవ్వబోమని కరాకండిగా చెబుతున్నారని విమ ర్శించారు. కాలువల కోసం రూ.437 కోట్లు తీసుకొచ్చామంటున్నా ఒక్క పని కూడా జరగలేదని, ‘మాటలు కోటలు దాటుతున్నాయి. పనులు గడప దాటడం లేదు‘ అంటూ తీవ్రంగా విమర్శించారు.

బీఆర్‌ఎస్ గుర్తులు చెరిపేయాలనే కుట్ర

గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మంత్రి.. హుస్నాబాద్కు మూడుసార్లు జాతీ య అవార్డులు ఎలా వచ్చాయని సతీశ్ కు మార్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.2.75 కోట్లతో 50 పడకల ఆసుపత్రిని నిర్మించామని, మాతా శిశు, డయాలసిస్ సెంటర్లను తీసుకొచ్చామని గుర్తు చేశారు. 250 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని, ఉన్న ఆసుపత్రిని కూలగొట్టడం బీఆర్‌ఎస్ గుర్తులను చెరిపేయాలనే కుట్ర కాదా అని నిలదీశారు. మహాసముద్రంగండి, గాడిదలలొద్ది, మిషన్ భగీరథ కింద 446 చెరువు కుంటల పునర్నిర్మాణం సహా తాము చేసిన పనులే తప్ప, కొత్తగా చేసిందేమీ లేదన్నారు.

హెలికాప్టర్ డ్రాపుడ్ ఎమ్మెల్యే

పొన్నం ప్రభాకర్ను సతీశ్ కుమార్ ’హెలికాప్టర్ డ్రాపుడ్ ఎమ్మెల్యే’గా అభివర్ణించారు. ఇలా వచ్చాడు, అలా తిరిగాడు, మాయమాటలు చెప్పి గెలిచాడని విమర్శించారు. నియోజకవర్గంలోని ఏ మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఊర్ల పేర్లు, దారులు, కాంగ్రెస్ నాయకుల పేర్లైనా తెలుసా అని సవాల్ విసిరారు. ఎవరు వెళ్లినా కోపంతో ఊగిపోవడం, మీడియా ముందేమో భుజం మీద చేయి వేసి ఫొటో స్టంట్స్ ఇవ్వడం తప్ప‘ మంత్రి చేసింది ఏమీ లేదన్నారు.

లాభాపేక్షతోనే అవినీతి.. 

సతీశ్ కుమార్.. మంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉండి ప్రజల కోసం పనిచేయకుండా ‘నా కోసమే గెలిచానని, పర్సంటేజీలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. ఏ పని చేసినా లాభాపేక్షతోనే‘ చేస్తున్నారని ఆరోపించారు. తాను మాత్రం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేశానని, అందుకే ముఖ్యమంత్రి సైతం తన పేరును గుర్తించారని పేర్కొన్నారు.

గడీలు కూలగొట్టి ’ప్రజాపాలన’ తెచ్చామని చెబుతున్నా, మంత్రికి సెక్యూరిటీ, క్యాంప్ ఆఫీస్కు బారికేడ్లు ఎందుకని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలనా? అరాచకపాలనా? అని నిలదీశారు. శంకుస్థాపన చేసిన పనులను 6 నెలల్లో పూర్తి చేయకపోతే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

* ’కోడ్ ఆఫ్ కండక్టు’కు విరుద్ధంగా సీఎం ప్రసంగం

హుస్నాబాద్లో బీఆర్‌ఎస్ పునాదులు గట్టిగా ఉండటంతో, తమ సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోతారనే భయంతోనే సీఎం హుస్నాబాద్లో సభ నిర్వహించారని సతీశ్ కుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి ’కోడ్ ఆఫ్ కండక్టు’కు విరుద్ధంగా గ్రామీణ ప్రాం తాల నుంచి ప్రజలను తరలించారని, మహిళలు, స్కూల్ పిల్లలను కూడా తరలించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. సర్పంచ్ ఎలక్షన్ల గురించి మాట్లా డొద్దని, ఫౌండేషన్లు వేయవద్దని నిబంధనలు ఉన్నా ముఖ్యమంత్రి చేశారని తమ పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిందని తెలిపారు.