05-12-2025 12:00:00 AM
ఖానాపూర్ లో కుటుంబసమరం
నంగునూరు, డిసెంబర్ 4: ఎన్నికలు అంటేనే అనుభవజ్ఞులు, యువకులుగ్రామ పంచాయతీ ఎన్నికల ప్రజాక్షేత్రంలో అదృ ష్టం పరీక్షించుకూనే ప్రక్రియ కొనసాగుతుం ది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండ లం లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ’భిన్నత్వంలో ఏకత్వం’అన్నట్టు విభిన్న అంశాలు ఉన్నాయి.
77ఏళ్ల వయసులో...
నంగునూరు గ్రామ పంచాయతీ సర్పం చ్ స్థానం ఎస్సీ రిజరవ్డ్ కాగా, ఇక్కడ 77 ఏళ్ల దేవులపల్లి చంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. ‘గ్రామ పాలనలో వయసు అడ్డు కా ద‘ని నిరూపిస్తూ, తన అనుభవంతో పరిపాలన సాగిస్తామని చంద్రయ్య నామినేషన్ దా ఖలు చేశారు. ఈ విషయం ఓటర్లలో ఆసక్తిని పెంచుతోంది.
మరోచోట యువతి సవాల్
మండల పరిధిలోని సిద్దన్నపేట గ్రామం బీసీ జనరల్ స్థానం నుంచి యువతి అణరాజుల రోహిణి సర్పంచ్గా పోటీపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీ జీ పూర్తి చేసిన రోహిణి, గజ్వేల్లోని ఎస్బీఐలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఎన్నికల బరిలో నిలబడడం అందరినీ ఆకట్టుకుంటోంది.
‘ఉద్యోగం రావడం పొందడం గొప్ప అవకాశం అయితే ఇమే ఉద్యోగం వదులుకొని రాజకీయ ప్రవేశం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ, తన ఆశయాన్నే పెట్టుబడిగా భావించి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆమె ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించారు.
అన్నదమ్ముల మధ్యత్రిముఖ పోరు
నంగునూరు మండలంలోని ఖానాపూర్ గ్రామంలో (బీసీ జనరల్) సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములిద్దరూ నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో ఓసీ జనరల్ మహిళా స్థానంకు సర్పంచ్ గా చేసిన ఐలేని సత్తవ్వ కుమారులు ఐలేని యాదగిరి, ఐలేని సతీశ్ ఈసారి పోటీకి దిగారు. వీరితోపాటు మరొక బీసీ అభ్యర్థి బాలమల్లేశం కూడా నామినేషన్ దాఖలు చేశారు.
మొత్తం 1035 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో ముగ్గురి మధ్యే గట్టి పోటీ ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.ఈ 3 గ్రామాలలో వయసు మీరిన పెద్దాయన, కొత్త ఆశయాలతో దూసుకొచ్చిన నవతరం, కుటుంబ సమరం మధ్య సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండడం జోరుగా చర్చ జరుగుతుంది.
నామినేషన్ల జోరు
నంగునూరు మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 120 నామినేషన్లు దాఖలు కాగా,220 వార్డు స్థానాలకు 506 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 6వ తేదీ వరకు గడువు ఉండడంతో బలమైన అభ్యర్థులు తమ ప్రత్యర్థులను బుజ్జగించి పోటీ నుంచి తప్పించి ఏకగ్రీవ ఎన్నికలకు పావులు కదుపుతున్నారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడంతో, ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే విషయంలో పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు.