05-12-2025 12:00:00 AM
కుబీర్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): మహారాష్ట్ర రాష్ట్రానికి కూత వేటు దూరంలో ఉన్న కుబీర్ మండలంలోని జాంగాం గ్రామ సర్పంచ్‌గా మణుకూరు నవనీతను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉప సర్పంచ్‌గా రాజేశ్వర్, మరో ఎనిమిది మందిని వార్డు సభ్యులుగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కూడా జాంగాం గ్రామస్తులు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో మొత్తం 800 మంది ఓటర్లు ఉండగా అందులో 400 మంది ఓటర్లు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారే.
జాంగాం గ్రామాన్ని గ్రామపంచాయతీగా ప్రకటించగా గత ఎన్నికల్లో మైనార్టీ వర్గానికి చెందిన ముజాహిద్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐదేళ్లపాటు సర్పంచ్ కొనసాగిన ముజాహిద్ ఖాన్ ఆ గ్రామంలో అందర్నీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడ్డారు.ఈసారి రెండోసారి ఆ గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా గురువారం గ్రామస్తులంతా పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.