అందరికీ మేలు చేసేలా పని చేయండి
డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ అర్బన్ ఆగస్టు 10: అందరికి మేలు చేసేలా పని చేయాలని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ అడ్వైసరీ కమిటీ సలహాదారుడు నంగి దేవేందర్ రెడ్డి సోమవారం నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి ఇంజనీరింగ్, ఐటీ మరియు హాస్పిటాలిటీ రంగాలలో అనుభవం ఉన్న యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ టామ్ మామ్ ద్వారా ఓవర్సీస్ జాబ్ మేళా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు నంగి బాచి రెడ్డి, కారెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అడ్వకేట్ మల్లెల రామకృష్ణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.






