15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మౌలిక సదుపాయాలకు కృషి

23-10-2025 12:28 AM

- ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్ అక్టోబర్22 (విజయక్రాంతి); నకిరేకల్ మున్సిపాలిటీలో దశలవారీగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 1, 8, 9 వార్డులలో రూ. 1. 55 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో వివిధ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికరించేందుకు కృషి చేస్తానన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు  నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, ఆ సేవలు ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. నియోజకవర్గంలో ఐటి కళాశాల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, ప్రజారోగ్య డిప్యూటీ ఈ ఈ మనోహర, మున్సిపాలిటీ ఏఈ గౌతమ్ రాజ్, ట్రస్మా రాష్ర్ట గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, కౌన్సిలర్లు కందాల బిక్షం రెడ్డి, గాజుల సుకన్య, రాచకొండ సునీల్, గడ్డం లక్ష్మీనరసింహస్వామి, బానోతు వెంకన్న, పన్నాల శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, ఎర్ర శంభు లింగారెడ్డి, యాసారపు వెంకన్న, పెద్ది యాదగిరి, చౌగోని సైదులు, మంటిపల్లి వీరు తదితరులు పాల్గొన్నారు.